MY DREAM FOUNDATION అనేది ఒక ప్రబుత్వ గుర్తింపు పొందిన సంస్థ( register no 92/2011 ). దీనిని కొంతమంది విద్యార్దుల సహకారంతో 3 - 3- 2011న స్థపించినాము. ఈ సంస్థ ద్వారా సమాజంలోని కొంత మంది వ్యక్తుల, ప్రదేశాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి స్థాపించినాము. దీని కొరకు ఈ సంస్థలొ వున్న ప్రతి సబ్యుడు ప్రతిరోజు ఒక్కొక రూపాయి పోగుచేసి సంస్థ అబివ్రుద్దికి తొడ్పడుతుతనారు.
ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశలు:
* పేద విద్యార్థులను చదివిచటం
* వికలాంగులకు ప్రోచ్చాహం అందించటం
* వెనుకబడిన ప్రాంతాలను అబివృద్ధి చేయటం
* పర్యావరనన్ని సంరక్షించడం
1. పేద విద్యార్థులను చదివిచటం:- మన సమాజంలో అనేక మంది పేద విద్యార్థులను ప్రతిభావంతులు అయినప్పటికి వారు పేదరికం వలన చదువును మద్యలొ ఆపివేస్తున్నారు. అటు వంటి పేదవిద్యార్థులలలో కొంత మందినైనా చదివించుటకు మన వంతు సహాయం అందించుటకు ఈ సంస్థను ప్రారంబించాము.
2. వికలాంగులకు ప్రోచ్చాహం అందించటం:- మన సమాజంలో ఎంతోమంది వికలాంగులు వున్నారు. వీరు ఎక్కువగా, మానసికంగా బదపడుతుంటారు. కనుక వీరికి మానసిక దైర్యాన్ని నింపి అన్నిరంగాలలోను ముందుకు నదిపించేలా ప్రోత్చాహించడం మనకర్తవ్యం. అందులో బాగంగానే ఈ సంస్థను ప్రారంబించి మనవంతు సహాయం ఈ సంస్థ ద్వారా అందించడానికి కృషి చేద్దం.
3. వెనుకబడిన ప్రాంతాలను అబివృద్ధి చేయటం:- మనదేసంలో అనేక ప్రాంతాలు పారిశ్రామికంగా లేదా వ్యాపార పరంగా అబివృద్ధి చెంది వున్నాయి. అలాగే అంతకంతే ఎక్కువ ప్రాంతాలు వెనుక పడి వున్నాయి. ఇటువంటి ప్రాంతాలలో వున్న ప్రజలకు వుండవలసిన కనీస ప్రాదమిక వనరులు కూడా అందుబటులో లేని ప్రాంతాలు ఉన్నాయి. మనిషి జీవించుటకు కావలసిన కనీస వనరులు అంటే నీరు, ఆహారం, నివాసం, ఈ వనరులు కూడా అందుబాటులో లేని ప్రజలు మనదేశంలో చాలా ప్రాంతాలలో ఉన్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో "నల్గొండ" జిల్లలో చాలా ప్రాంతాలలో త్రాగుటకు నీరు కూడా దొరకని పరిస్థితి వున్నది. అలాగే మరికొన్ని ప్రాంతాలలో నీరు వున్నా త్రాగుటకు ఉపయోగపడుటలేదు. మరికొన్ని ప్రాంతాలలో తినటానికి సరైన ఆహారం వుండట్లేదు, మరికొన్ని ప్రాంతాలలో కొందరికి నివసించటానికి సరైన ఇళ్ళులేక బాదపదుతున్నారు. కనుక ఇటువంటి వారిని ఉద్దేసించి వాళ్ళ ప్రాంతాలకు కావలసిన కనీస వనరులను అందించుటకు మనవంతు సహాయం ఈ సంస్థ ద్వారా అందిద్దాం.
4. పర్యావరనన్ని సంరక్షించడం:- ప్రస్తుతం మానవుడు తన అవసరాల కొరకు తన చుట్టూ వున్న పర్యావరణన్ని నాశనం చేస్తున్నాడు. దీని వలన మనం బవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సమస్యలకు కారణాలు అనేకం వున్నాయి. ఉదాహరణకు అడవులను నరకడం వల్ల వర్షాలు రాకపోవడం, ఓజోను పొర దెబ్బతినడం వలన భూ ఉపరితలంపైన ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం ఉండవలసిన దానికన్న పెరుగుతున్నాయి. దీనిని తగ్గించుటకు మన వంతుగా మన సంస్థ ద్వారా ప్రజలలో పర్యావరణ సంరక్షణ గురించి అవగహణ కల్పించడం, ప్రాధమిక విద్యర్ధులకు పర్యవరణం గురించి కొంత పరిజ్ఞానం కలిగించడం లంటి కార్యక్రమాలు మనం ఈ సంస్థ ద్వారా చేద్దాం.